సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ముస్లీం సంఘాలు కదం తొక్కాయి. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇందిరాపార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. లక్డీకపూల్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్, ఇందిరాపార్క్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. వేల సంఖ్యలో పలువురు జాతీయ జెండాలు చేతబట్టుకొని రావటంతో రోడ్లన్నీ ఎన్నార్సీ వ్యతిరేక నినాదాలతో మార్మోగిపోయాయి.
దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Advertisements