మతాల పేరుతో నిత్యం కొట్టుక చస్తున్న దేశంలో… దేశ సమగ్రతా ఇంకా బతికే ఉంది అని చెప్పే ఉదాహరణ ఇది. మతం ఏదైనా మనమంతా భారతీయులం, మనమంతా మనుషులం అని సగర్వంగా చాటి చెప్పిన అర్థం ఇది. మతాల పేరుతో ప్రజలను విడదీసి… పాలించే నాయకులకు చెంపపెట్టులాంటి సమాధానం ఇది.
దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న పండుగల్లో మత సామరస్యం వెల్లువిరుస్తుంది. ముఖ్యంగా… హిందు-ముస్లింల పండుగలు కలిపి చేసుకునే సందర్భాలుంటాయి. అలాంటి సందర్భమే మరోసారి ఆవిషృతమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో మతసామరస్యంతో… మేము ప్రజలం, భారతీయులం అని చెప్పే ఉదాహరణకు దీపావళి పండుగ సందర్భమైంది. ఢిల్లీలోని హుజరత్ నిజాముద్దీన్ సుఫీ దర్గా చాలా ఫేమస్. అక్కడకు వందలాది మంది యాత్రీకులు వస్తుంటారు. అయితే.. దీపావళి పండగ సందర్భంగా దర్గాలో దీపావళి సంబరాలు చేసుకున్నారు ముస్లీంలు.
దీనిపై సోషల్ మీడియాలో ట్రూస్పిరీట్ ఆఫ్ ఇండియా, వీ ఆర్ యూనిక్ ఇలా పొగడ్తలతో కామెంట్స్ వస్తున్నాయి. మతాల ఘర్షణ ఎక్కువగా ఉండే ఉత్తర భారతదేశంలో… దేశ రాజధానిలో ఈ సాంప్రదాయం నిజంగా ఎంతో శుభసూచికం అంటున్నారు విశ్లేషకులు.