పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉన్న వారు డిసెంబర్ 11 నుంచి అమలులోకి రానున్న కొన్ని కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ రూల్స్ పోస్టాఫీసులో అకౌంట్ ఉన్న వారిపై ప్రతికూల ప్రభావం చూపించనున్నాయి. ముఖ్యంగా మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ఇన్నాళ్లు బ్యాంకుల్లోనే మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ నిబంధన పోస్టాఫీసు అకౌంట్లకు కూడా వర్తించనుంది. పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు డిసెంబర్ 11 నుంచి కచ్చితంగా అకౌంట్‌లో 500 రూపాయల బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
మినిమం బ్యాలెన్స్ లేనట్లయితే మెయింటెనెన్స్ చార్జీలు కట్టాల్సి వస్తుంది. పోస్టాఫీస్ ఇప్పటికే సేవింగ్స్ కలిగిన వారికి ఈ విషయాన్ని తెలియజేసింది. ఒకవేళ అకౌంట్‌లో అసలు డబ్బులు లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై 4 శాతం వడ్డీ లభిస్తుంది. 10,000 వరకు వడ్డీ మొత్తంపై ఎలాంటి వడ్డీ పడదు. మూడు ఆర్ధిక సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా లావాదేవీ నిర్వహించి ఉండాలి. అప్పుడే అకౌంట్ క్లోజ్ అవకుండా ఉంటుంది. ఇంకా కస్టమర్లకు ఏటీఎం, చెక్‌బుక్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి.