ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ కారుపై మంగళవారం కేరళలో గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో జార్జ్ అలెగ్జాండర్ కు తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో కేరళలోని 43 ముత్తూట్ బ్రాంచీల్లో 160 మంది ఉద్యోగులను తొలగించారు. దీంతో వారిలో కొందరు సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. దాడి వెనుక సి.ఐ.టి.యు గూండాలున్నట్టు ముత్తూట్ యాజమాన్యం ఆరోపిస్తుండగా…తమకెలాంటి సంబంధం లేదని సి.ఐ.టి.యు ఖండించింది. ఈ సంఘటన వెనుక ఉద్యోగుల హస్తం లేదని భావిస్తున్నట్టు ఆ రాష్ట్ర కార్మిక మంత్రి టి.పి.రామకృష్ణ తెలిపారు.