పోలీస్ శాఖలో మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించారు ఉన్నతాధికారులు. సమాన హోదా కలిగిన పోలీస్ ఉద్యోగుల మధ్యనే మ్యూచువల్ బదిలీలుంటాయని పేర్కొన్నారు. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను డీజీపీ కార్యాలయంలో అధికారులు బుధవారం విడుదల చేశారు.
బదిలీల కోసం వచ్చే నెల 15లోగా ఇంటిగ్రేటేడ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంగీకార పత్రాలను సంబంధిత ఉద్యోగి నుంచి తీసుకుని దాన్ని ఆన్ లైన్ లో జతచేయాలని పేర్కొన్నారు.
దరఖాస్తు హార్డ్ కాపీలను సంబంధిత ఎస్పీ లేదా కమిషనరేట్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. బదిలీ జరిగే వారికి పాత సీనియారిటీ ఉండదని నివేదికలో పేర్కొన్నారు. కొత్తగా చేరే యూనిట్ సీనియారిటీ చివర్లో ఉంటుందని తెలిపారు.
సస్పెండైనా.. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్నా, అనధికారికంగా విధులకు హాజరుకపోయినా.. ఈ మ్యూచువల్ బదిలీలకు అనర్హులని స్పష్టం చేశారు అధికారులు.