నా కడుపులో ఉన్న బిడ్డకు ఇద్దరు వ్యక్తులు కారణమంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. నా బిడ్డకు ఇద్దరు తండ్రులు, ఆ ఇద్దరు వ్యక్తులు పలుమార్లు నాపై అత్యాచారం చేశారని, ఇప్పుడు నా బిడ్డకు ఆ ఇద్దరే తండ్రులు అవుతారని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ కు గురయ్యారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఇంటర్‌తో చదువును మానేసి వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తితో ఆమెకు చనువు ఏర్పడింది. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రామారావు ఆ యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు.
ఈ వ్యవహారాన్ని గమనించిన పైడిరాజు అనే మరో వ్యక్తి తల్లిదండ్రులకు చెప్పేస్తానంటూ బెదిరించి ఆ యువతిపై అనేక సార్లు లైంగిక దాడి చేశాడు. ఇక యువతిలో శారీరక మార్పులు గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నిలదీయడంతో అసలు విషయం చెప్పుకొచ్చింది. వెంటనే వైద్య పరీక్షలు చేయించగా యువతి ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. ఇక కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు బాధితురాలు చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామారావు, పైడిపల్లి తనను లైంగికంగా వాడుకున్నారని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు వారే కారణమని, ఆ ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న చీపురుపల్లి పోలీసులు దర్యాప్తును చేపట్టారు.