తన కుటుంబం ప్రమాదంలో ఉందని బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ అన్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తన కుటుంబంపై ఇస్లామిక్ చాంధసవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
నాకు గానీ లేదా నా కుటుంబానికి సంబంధించిన విషయాలను గానీ ఎవరికీ షేర్ చేయవద్దని అందరిని కోరుతున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ చాలా మంది దాన్ని పట్టించుకోకుండా నా ఇంటి అడ్రస్సును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నా కుటుంబానికి ఇస్లాం చాందసవాదుల నుంచి ప్రమాదం ఉంది
తనకు ఇటీవల ఓ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ బెదిరింపు కాల్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్ లో డిమాండ్ చేశారు.
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నవీన్ జిందాల్ తో పాటు నుపూర్ శర్మలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఓ హిందువుగా తాను గర్వపడుతున్నానని అన్నారు. తన ఆందోళన అంతా తన కుటుంబం గురించేనని ఆయన తెలిపారు.