“నన్ను లైంగికంగా వేధించడం తన జన్మ హక్కుగా మా నాన్న భావించేవాడు.నేను 8 ఏళ్ల వయసు నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. 15 వయసులో అతడికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వచ్చింది. 16 ఏళ్ల వయసు వచ్చే నాటికి తను మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం మా అమ్మకు చెప్పలేదు. తనకు ఇప్పుడు చెప్పినా నమ్మకపోవచ్చు..” ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. నటి ఖుష్బూ. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ మధ్యే జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలిగా పదవి చేపట్టిన ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తాజాగా ఆమె మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాను కూడా లైగింక వేధింపులకు గురైనట్లు చెప్పారు. చిన్న వయసులోనే తన తండ్రే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ ఆమె సంచలన విషయాలు వెల్లడించారు.
ఇక కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి నుంచే వేధింపులు ఎదురవ్వడం దారుణమని అన్నారు. 15 ఏళ్ల వయసు వచ్చాక అతడిని ఎదిరించడం మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు. 16 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలిపెట్టి తన తండ్రి వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇక ముంబైలో జన్మించిన ఖుష్బూ చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.