మై హోమ్ రామేశ్వర్ రావు తో దోస్తీ ఉత్తమ్ కొంపముంచిందా?ఎవరికి వేసినా మై హోమ్ కు వేసినట్టే అని అధికార పార్టీకే పట్టం కట్టారా??
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆరెఎస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీనికి ప్రధాన కారణం మై హోమ్ రామేశ్వర్ రావు అన్నది విశ్లేషకుల మాట. అసలు మై హోమ్, ఉత్తమ్, టీఆరెఎస్ మధ్య ఉన్న లింక్ ఎంటో తెలిస్తే అసలు విషయం అర్థమవుతుంది.
హుజూర్ నగర్ లో అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. మై హోమ్ రామేశ్వర్ రావు ఎవరు గెలవాలని డిసైడ్ అయితే వారిదే అక్కడ విజయం అని లోకల్‌లో టాక్ ఉంది. ఆ అభ్యర్థి గెలుపు కోసం ఫండింగ్ అంతా రావు గారే చూస్తారట. మరి రామేశ్వర్ రావుకి ఏంటి లాభం అని డౌట్ రావొచ్చు…గెలిచిన అభ్యర్థి హుజూర్ నగర్‌లో ఉన్న మై హోమ్ కంపెనీ లకు ఇబ్బంది లేకుండా చూసుకోవడమే గెలిచిన అభ్యర్థి పని అన్నది ప్రజల మధ్య జరుగుతున్న చర్చ. అందుకే ప్రతిపక్షం, అధికార పక్షం అన్న తేడా లేకుండా మై హోమ్ కు అందరూ దగ్గరి మిత్రులే.
ఉత్తమ్ కుటుంబానికి, మై హోమ్ రామేశ్వర్ రావు కుటుంబానికి కూడా దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. 2014 ఎన్నికల్లో ఉత్తమ్ గెలుపుకు మై హోమ్ అన్ని రకాలుగా ఉపయోగపడ్డారని టాక్. అంతేకాదు హుజూర్ నగర్ లో అనేక సమస్యలకు కారణమవుతున్న మై హోమ్ రామేశ్వర్ రావును ఉత్తమ్ తన ప్రచారంలో ఎక్కడా విమర్శించింది లేదు. దీన్ని బట్టే ఇద్దరి మధ్య సంబంధాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక మైహొమ్ రామేశ్వర్ రావు, టీఆరెఎస్ సంబంధాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ అండతోనే మై హోమ్ కోట్లకు పడగలెత్తారన్నది ముందు నుండి ఉన్న ప్రచారం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎవరు గెలిచినా మై హోమ్ గెలిచినట్టే అని భావించినప్పుడు, మరో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండే టీఆరెఎస్ వైపే మొగ్గు చూపినట్లు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే మై హోమ్ తో ఉత్తమ్ దోస్తీ కాంగ్రెస్ కొంపముంచిందని కాంగ్రెస్ నాయకులతో పాటు, ప్రజలు కూడా అనుకుంటున్నారు…