నా కొడుకును చంపి అధికార, రాజకీయ బలంతో దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సింగరేణికి చెందిన మృతుని తల్లి జయలక్ష్మి ఆరోపించారు. అయితే.. గత నెల 14.. సింగరేణిలోని రహదారిపై తన కుమారుడు అనిల్ కుమార్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి హత్య చేశారని తెలిపింది.
సింగరేణిలో తనకున్న స్థలాన్ని.. ఒక రాజకీయ పార్టీ నాయకురాలు తన అనుచరులతో కలిసి కబ్జాకు యత్నించారని.. అడ్డుకున్నందుకు తనపై తప్పుడు కేసులు పెట్టి.. తమను చంపుతామని దెదిరించారని అన్నారు. అన్నట్టుగానే.. 24 గంటలు తిరగకముందే తన కొడుకును పెట్రోల్ పోసి చంపారని ఆరోపించారు విజయలక్ష్మి.
హత్య చేసిన వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని వాపోయారు. వారి నుంచి నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది.
ఎన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కంటనీరు పెట్టుకున్నారు. వారితో తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే నిజాలు బయటపడుతాయని తేల్చిచెప్పారు విజయలక్ష్మి.