పీపీఈ కిట్ల విషయంలో తన భార్య ఒక్క పైసా కూడా తీసుకోలేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా చేసిన అవినీతి ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.
తన భార్యపై మనీశ్ సిసోసిడియా చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్టు తెలిపారు. పీపీఈ కిట్ల పంపిణీని సామాజిక బాధ్యతగా తన భార్య భావించారని అందుకే వాటిని విరాళంగా అందించారని ఆయన చెప్పారు.
పీపీఈ కిట్లు ఇచ్చినందుకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు. తన భార్యపై సిసోడియా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బిశ్వ శర్మ అన్నారు.
ఇలాంటి ఆరోపణలను మానుకోకపోతే సిసోడియా పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కరోనా సమయంలో పీపీఇ కిట్లు లేని సమయంలో ప్రభుత్వానికి తన భార్య 1500 కిట్లను ఉచితంగా అందించిదని చెప్పారు.