నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మయన్మార్ రాజకీయ నాయకురాలు అంగ్ సన్ సూకీ ఈరోజు అంతర్జాతీయ న్యాయస్థానానికి హాజరయ్యారు. మయన్మార్ లో రోహింగ్యాల మారణ హోమంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆమె విచారణను ఎదుర్కొంటున్నారు. తనపై మోపిన కేసులను తానే వాదించకుంటున్నారు. హక్కుల కార్యకర్తగా ఒకప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్శించిన సూకీ… రోహింగ్యాల మారణహోమంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. సాంప్రదాయ బర్మా దుస్తులు ధరించి వచ్చిన సూకీ కోర్టు బయట మీడియా ఎదురు చూస్తున్నప్పటికీ వారితో మాట్లాడకుండా నేరుగా వెళ్లిపోయారు. 2017 లో రోహింగ్యా ముస్లిం మైనార్టీలపై మయన్మార్ మిలిట్రీ జరిపిన కాల్పుల కేసులో సూకీ విచారణకు హాజరయ్యారు.