విజయవాడ: వినాయకుడి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా ఎ.కొండూరు తండాలో విషాదం అలుముకుంది. వినాయకుణ్ణి నిమజ్జనం చేసేందుకు తండాలోని చెరువులో దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. బాణవతు గోపాలరావు, భూక్యా శంకర్, భూక్యా చంటి అనే యువకులు వినాయకుణ్ణి చెరువులో నిమజ్జనం చేసే ప్రదేశం లోతు తక్కువగా ఉండటంతో నీటిలో మునిగి ఊపిరి ఆడక ప్రాణాలు వదిలారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అర్ధరాత్రి గాలింపు చర్యలు చేపట్టారు. మైలవరం సీఐ శ్రీను చెరువులోకి దిగి చనిపోయిన ముగ్గురు యువకుల మృతదేహాలను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు.