టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి మరోసారి రెచ్చిపోయారు. బండి సంజయ్ పై చేసిన కామెంట్స్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. వాటికి కట్టుబడి ఉన్నానని చెబుతూనే.. త్వరలోనే బండి సంజయ్ ని బట్టలిప్పి రోడ్డుపై నిలబెడతానని హెచ్చరించారు. బీజేపీ నేతల అంతు చూసేందుకు ఒకే ఒక్కరోజు చాలని… దానికి కేసీఆర్ అవకాశం ఇవ్వాలని కోరారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సంజయ్ ని బరాబర్ తిడతానని అన్నారు మైనంపల్లి. బహిరంగ క్షమాపణ చెప్పేవరకు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే బండి సంజయ్ భూముల వ్యవహారం బయటపెడతానని చెప్పారు. మల్కాజిగిరి ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని… అశాంతి సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడి తర్వాత టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లా సాగిన యుద్ధం… అనంతరం బండి వర్సెస్ మైనంపల్లిలా మారింది. శ్రవణ్ ను పరామర్శించిన తర్వాత మైనంపల్లిపై మండిపడ్డారు సంజయ్. కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో మైనంపల్లి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బండిని బండ బూతులు తిట్టారు. ఈక్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్ధించుకున్నారు మైనంపల్లి.