ఎన్నో మిస్టరీలకు నెలవైన ఆకాశంలో ఓ వింత దృశ్యం కనిపించింది. పంజాబ్ లోని పఠాన్ కోట్‌లో వింత కాంతులు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు ఆశ్చర్యంతో కూడిన భయానికి లోనయ్యారు.
దాదాపు ఐదు నిమిషాలపాటు ఆకాశంలో ఒక వరుసలో వెలుగులు కనిపించాయి. అయితే.. అది ఉపగ్రహమని రక్షణ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.
నిజానికి ఇలాంటివి జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలో చాలాసార్లు లైట్ల వెలుగులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి.