గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో నిందితుడు ఒకరు అనుమానస్పద స్థితిలో మరణించిన ఉదంతం సంచలనం కలిగించింది. లాకప్ డెత్ జరిగిందా.. లేక గ్రామస్తులు కొట్టడంతో మృతి చెందాడా అనేది విచారణలో తేలాల్సివుంది.
గుంటూరు: గుంటూరు జిల్లా వినుకొండలో ఓ మిస్టరీ డెత్ జరిగింది. ఇది ఎలా జరిగిందన్నది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. వివరాలు పరిశీలిస్తే వినుకొండ మండలం విట్టంరాజు పల్లి గ్రామానికి చెందిన పగడాల వేమారెడ్డి (60) అవివాహితుడు గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన 3 సంవత్సరాల పాపపై అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై గ్రామస్తలు దాడి చేసి పోలీసులకు అప్పగించారని సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కోమాలోకి చేరిన వేమారెడ్డిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. అప్పటికే వేమారెడ్డి మరణించినట్టు తెలుస్తోంది. వేమారెడ్డి గ్రామస్తుల దాడిలో చనిపోయాడా.. లేక లాకప్ డెత్ చేశారా అనేది విచారణలో తేలనుంది.