టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, కీలకమైన నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు పై వచ్చే ఆరోపణలు అనేకం. ఇతర సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంటర్ అవుతుందని, ఉప్పెన సినిమాతో తమ సినిమాలను వారే డిస్ట్రిబ్యూషన్ చేస్తారని ప్రచారం జరిగింది.
నిజానికి ఉప్పెనతో పాటు ఇతర సినిమాలను రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ఆసక్తిగానే ఉన్నారు. దింతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని, దిల్ రాజు దుబాయ్ లో సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత మైత్రీ సంస్థ ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రావటం వాయిదా పడినట్లు ఇండస్ట్రీ టాక్.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా పలు పెద్దహీరోల సినిమాలు రాబోతున్నాయి.