ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంభినేషన్ లో సినిమా ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. కేజీఎఫ్ తో సంచలన విజయం అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను కలిశాడని ఊహాగానాలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. మూవీ షూట్ కూడా ప్రారంభం అయ్యింది. దీంతో ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందా…? అన్న చర్చ తెరపైకి వచ్చింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం… ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ పూర్తయ్యాక, ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేశాక ఈ మూవీ పట్టాలెక్కుతుందని స్పష్టం చేశారు.