నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన ఉప్పెన సినిమాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటనతో పాటు విజయ్ సేతుపతి నటన అందరినీ ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం కోట్ల వసూళ్లను రాబడుతోంది. అయితే మొదటి సినిమాతోనే దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న బుచ్చిబాబు పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక నిర్మాతలకు కూడా ఈ సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టడంతో బుచ్చిబాబుని… నీ కోరిక ఏంటని అడిగారట. రెండు భారీ ఆఫర్ లు కూడా ఇచ్చారట. ఖరీదైన కారు, ఇల్లు రెండింటిలో ఏదో ఒకటి కోరుకోవాలని ఆఫర్ చేశారట. ఇలాంటి సినిమా తీసిన బుచ్చిబాబు కు ఎన్ని గిఫ్టులు ఇచ్చినా తక్కువే అంటూ సినీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.