శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చిత్తూరు జిల్లా ఐరాల జలపాతం దగ్గర జరుగుతున్నట్లుగా ఓ వీడియో బయటికి వచ్చింది. జలపాతంలో జరిగిన యాక్సిడెంట్‌ను చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరికొన్ని రోజుల పాటు చిత్రయూనిట్ ఇదే ప్రాంతంలో చిత్రీకరణ జరపనుందని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.