‘నాటునాటు’ పాట .ట్రిపుల్ ఆర్ టీమ్ ని, ఇండియాని ప్రపంచ సినిమా వేదికపై నిలిపిన సంగతి తెలిసిందే.! ఈ పాట వినపడగానే సంగీత ప్రియుల కాళ్ళు అప్రయత్నంగానే కదులుతాయి. మనసు ఊగుతుంది. అందుకేఈ పాట ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కూడగట్టుకుంది.
సెలబ్రిటీలైతే మాత్రం పైనుంచి ఊడిపడ్డారా..! ఈ పాట వినగానే ఊగిపోకుండా ఉంటారా..!? అంతగా ఈ పాట ప్రేక్షకుల్ని అలరించింది. ‘ఆస్కార్’ అందుకున్న మరుసటి రోజు క్రికెట్ స్టేడియంలో సునీల్ గవాస్కర్ ‘నాటు నాటు’ పాటకు అవార్డు రావడం పట్ల చిత్ర బృందాన్ని అభినందించడమే కాకుండా ఆ పాటకు స్టెప్ కూడా వేశారు.
తాజాగా భారత మాజీ క్రికెటర్లు హర్భన్‌సింగ్, సురేష్ రైనా క్రికెట్ స్టేడియంలో ‘నాటునాటు’ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కీలక పాత్రధారులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అంతర్జాతీయ వేదికలపై పలు పురస్కారాలతోపాటు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక అవార్డు ‘ఆస్కార్’ అందుకొని తెలుగు సినిమా సత్తా చాటింది.
Those are some sweet feet, I tell you what! 😍@IndMaharajasLLC @harbhajan_singh @ImRaina #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #IMvsWG pic.twitter.com/Kv9y1ss6bs
— Legends League Cricket (@llct20) March 15, 2023