ఒకప్పుడు పెద్దహీరోల సినిమా సిటీల్లో రిలీజై పల్లెటూళ్ళుదాకా రావాలంటే పల్లె ప్రేక్షకుల కళ్ళుకాయలు కాచేవి. ఇప్పుడు ఇంటర్నెంట్, ఓటీటీల పుణ్యమా అని సినిమాకి ఎల్లలు చెరిగిపోయాయి. ఏసినిమా ఎక్కడ రిలీజైన మన చేతికొచ్చి చేరుతుంది.ఈ యేడాది దేశం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోయింది.
రామ్, చరణ్ లు అద్భుతంగా నటించడంతో పలు వేదికల్లో ప్రదర్శితమై సినీ ప్రియుల మనసు గెలుచుకుంది.వారు నటించిన “నాటునాటు” పాటైతే అందరి గుండెల్లో నాటుకుపోయింది. మన జానపథానికి, ఇంగ్లీష్ ని మిక్స్ కొట్టి రూపొందించిన ఈ పాటని విన్నా చూసినా పూనకాలు వస్తాయ్.
When it comes to football, Ram and Bheem are just goals ⚽💯#RRR pic.twitter.com/62d65vAist
— Golden (@netflixgolden) December 2, 2022
ప్రపంచ ఫుట్ బాల్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో రెండు ఫుట్ బాల్స్ ని తెచ్చి నాటుడాన్స్ వేస్తున్నరామ్,భీమ్ ల మధ్య పడేసాడోజౌత్సాహికుడు. ఇక చూసుకోండి ! ఫుట్ బాల్ కూడా నాటు డాన్స్ వేస్తూ నెట్టింట్లో సందడి చేస్తుంది.నిజానికి ఈ యంగ్ హీరోలిద్దర్ని జట్టులోకి తీసుకున్నా ఆడుపాడుతూ ప్రపంచ కప్పు తీసుకొస్తారేమో ! అనుకుంటున్నారు నెటిజన్లు.