‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చరిత్రను తిరగరాసింది. ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. దక్షిణాది నుంచి తొలిసారి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రంగా ఇది నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా మెరిసింది. ప్రపంచ పటంపై జక్కన్న తన లెవెల్ ఏంటో చూపాడు. ‘నాటు కొట్టుడు’తో ఆస్కార్ వేదిక దద్దరిల్లింది. ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అవార్డు అందుకున్నారు.
95 వ ఆస్కార్ అవార్డుల పండుగలో తెలుగు పాట ‘నాటు నాటు’ చేసిన రచ్చ ఇంతాఅంతా కాదు. తెలుగోడి సత్తా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందంటే ఇది చేసిన మెస్మరిజం బాప్ రే అనాల్సిందే..! దీని గురించి మొదట బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ .. హాలీవుడ్ కి పరిచయం చేశారు. ఇక లాస్ ఏంజిలిస్ లో అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డ్స్-2023 లో హాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు, తారలతో బాటు ఈ ఏడాది నామినేషన్ లో ఉన్న సినీ నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ వేడుకకు హాజరయ్యారు. భారతీయ సినీ ప్రేక్షకుల కలను కేవలం అడుగు దూరంలో నిలిపి చివరకు ఈ ఘనత సాధించిన నాటు నాటు సాంగ్ కి ఫిదా కానివారు లేరు.. .
ఇక షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఉత్తమ భారతీయ డాక్యుమెంటరీ చిత్రంగా ‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ని ఆస్కార్ వరించింది. కేవలం 40 నిముషాల ఈ డాక్యుమెంటరీ. ‘రఘు’ అనే గున్న ఏనుగు మూవీ చుట్టూ తిరుగుతుంది. అనాథగా మారిన ఈ చిన్ని ఏనుగును వేటగాళ్ల బారి నుంచి రక్షించడానికి బొమ్మన్, బెల్లీ అనే జంట పడిన తపనను ఇందులో హృద్యంగా చూపారు. ఈ డాక్యుమెంటరీని రూపొందించిన కార్తీకి గాన్ స్లేవ్స్, గునీత్ మొంగా ”ఆస్కార్’ అవార్డును స్వీకరిస్తూ దీన్ని ‘మదర్ ఇండియా’కు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు.
ఇక విజేతల జాబితా విషయానికే తీసుకుంటే..
జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్ ది వే వాటర్’ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ దక్కించుకుంది. ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్ మ్యాన్, బ్లాక్ పాంథర్.. వకండా ఫరెవర్ టాప్ గన్, మావరిక్ చిత్రాలను ఇది వెనక్కి నెట్టింది.
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రానికే ఉత్తమ ప్రొడక్షన్, డిజైన్ విభాగంలోనూ ఈ పురస్కారం దక్కింది.
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో గులెర్మో టోరో పినోచియో కి ఈ అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటుడిగా బ్రెండన్ గ్లెసన్, ఉత్తమ సహాయ నటిగా ఏంజెలా బ్యాసెట్ ఆస్కార్ అవార్డు స్వీకరించారు.
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం గా యాన్ ఐరిష్ గుడ్ బై కి పురస్కారం లభించింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ మళ్ళీ ఆస్కార్ దక్కించుకుంది. లీడ్ యాక్టర్ గా ఎల్విస్,లీడ్ యాక్ట్రెస్ గా కేట్ బ్లాంచెట్ ఈ అవార్డులు సొంతం చేసుకోగా.. , బెస్ట్ పిక్చర్ గా ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ఆస్కార్ పురస్కారాన్ని పొందింది.