ఆర్ఆర్ఆర్ టాప్ ఎట్రాక్షన్స్ లో ఒకటి నాటు నాటు సాంగ్. అసలు రిలీజ్ కు ముందు ఈ సినిమాకు ఓ ఊపు తీసుకొచ్చిన పాట ఇదే. విడుదలైన తర్వాత వెండితెరపై కూడా హిట్టయిన సాంగ్ ఇదే. ఇప్పుడీ పాట మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఈ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయడమే.
ఆర్ఆర్ఆర్ లో సూపర్ హిట్టయిన నాటునాటు సాంగ్ ను రిలీజ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మరోసారి పండగ చేసుకుంటున్నారు. ఇద్దరు డాన్సింగ్ స్టార్స్ కలిసి చేసిన ఈ పాట విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు పెర్ ఫెక్ట్ సింక్ తో ఎన్టీఆర్, చరణ్ కలిసి చేసిన ఈ డాన్స్ నంబర్ పెద్ద హిట్టయింది. ఈ పాట కోసమే చాలా మంది రిపీటెడ్ గా ఆర్ఆర్ఆర్ సినిమా చూశారు.
అలాంటి సాంగ్ యూట్యూబ్ లోకి రావడంతో ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. చరణ్ ఫ్యాన్స్ అంతా తమ నటుడి డాన్స్ క్లిప్ ను వైరల్ చేస్తుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో డాన్స్ క్లిప్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక న్యూట్రల్ గా ఉండే ప్రేక్షకులు.. వీళ్లిద్దరూ కలిసి చేసిన సింక్ మూమెంట్ ను వైరల్ చేస్తున్నారు. ఇలా నిన్నట్నుంచి వైరల్ గా మారింది నాటు-నాటు సాంగ్.
కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటకు, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. అతడి కెరీర్ లో ఇది బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఇక ఈ డాన్స్ కోసం చరణ్-తారక్ పడిన కష్టం అందరికీ తెలిసిందే. ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాము పడిన కష్టాన్ని ఇద్దరూ చెప్పుకొచ్చారు. కాళ్లు, ఒళ్లు నొప్పులుతో చాలా ఇబ్బంది పడ్డామని వెల్లడించారు. మొత్తానికి వీళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కింది. నాటునాటు సాంగ్ చరిత్రలో నిలిచిపోయింది.