ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన నటనతో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న నభా నటేష్. ఇటీవల ఈమె మరే చిత్రంలో కనిపించలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సమయంలో తను ఇలా బ్రేక్ తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆ విషయాన్ని నభా నటేష్ బయటపెట్టింది.
“గడిచిన సంవత్సరం చాలా కష్టంగా సాగిపోయింది, నాకొక ప్రమాదం జరిగింది, అప్పుడే నా ఎడమ భుజానికి తీవ్ర గాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.”
ఇలా తను యాక్సిడెంట్ కు గురైన విషయాన్ని బయటపెట్టింది నభా నటేష్. చికిత్సలో భాగంగా తను తీవ్రమైన శారీరక, మానసిక బాధని ఎదురుకున్నట్టు చెబుతూ తను మళ్ళీ నటించడం మొదలుపెడతానని, తిరిగి చిత్రాలు చేస్తానని చెప్పుకొచ్చింది.
కొత్త ఏడాదిలో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తానంటోంది ఈ బ్యూటీ. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే పోటీ ఎక్కువైంది. కృతి శెట్టి లాంటి హీరోయిన్లు తారాజువ్వల్లా దూసుకొచ్చారు. ఇలాంటి టైమ్ లో గ్యాప్ తో వస్తున్న నభా నటేష్, ఏ రేంజ్ లో నెగ్గుకొస్తుందో చూడాలి.