‘ది కశ్మీర్ ఫైల్స్’సినిమాపై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) జ్యూరీ హెడ్ నాదవ్ లాపిడ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’సినిమా ఓ దరిద్రపు గొట్టు సినిమా అని, దాన్ని చాలా వల్గర్‌గా చిత్రీకరించారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో లాపిడ్ వెనక్కి తగ్గారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇఫీ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమించాలని ఆయన కోరారు. ఎవరినీ కించపరిచే, అవమానించే ఉద్దేశం తనకు ఏ మాత్రమూ లేదని ఆయన పేర్కొన్నారు.
తాను చేసిన వ్యాఖ్యలు ఎవరైనా బాధించి వుంటే అందుకు తనను క్షమించాలని కోరారు. 53వ ఇఫీ వేడుకలను గోవాలో నిర్వహించారు. ఇందులో‘ది కశ్మీర్ ఫైల్స్’సినిమాను ప్రదర్శించడాన్ని జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ ఫిలింమేకర్ నాదవ్ లాపిడ్ తప్పుబట్టారు.
ఇండియన్ పనోరమా కేటగిరీలో ఈ చిత్రాన్ని నవంబర్ 22న ప్రదర్శించారు. ఇందులో ప్రదర్శించిన 15 చిత్రాల్లో ఇదొకటి. ఇఫీ చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించడంపై నాదవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.