కింగ్ నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సొలొమాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ్ ఎన్.ఐ.ఏ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కానుంది.
నిజానికి ఈ సినిమాను థియేటర్లు ఓపెన్ చేయాలన్న నిర్ణయానికి ముందే నెట్ ఫ్లిక్స్ కు అమ్మేశారు. దాంతో థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా డిజిటల్ రిలీజ్ కానుంది. ఇటీవలే వైల్డ్ డాగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని పూర్తయ్యాయి. ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళంలో రిలీజ్ కానుంది. డబ్బింగ్ పనులను కూడా నాగ్ ఇప్పటికే పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాను 37కోట్ల రికార్డ్ ధరకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ పాల్గొనగా, మ్యాట్నీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.