రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ మూవీలతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిస్టులో మరో అప్ కమింగ్ మూవీ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ.. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని ఇప్పటికే మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ పట్టాలెక్కబోతుండగా… తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇప్పటివరకు ప్రాజెక్ట్ కే మూవీలో ప్రభాస్‌తో పాటు దీపికా పడుకొణేతో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఓ కీ రోల్ చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే లెటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ మూవీలో టాలీవుడ్‌కు చెందిన మరో ఇద్దరు క్రేజీ స్టార్స్ నటించబోతున్నట్టుగా ప్రచారం జరగుతోంది. వారెవరో కాదు వరుస విజయాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, అలాగే నాచురల్ స్టార్ నాని అని తెలుస్తోంది.టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న మూవీలో ఈ ఇద్దరు హీరోలు.. కొద్దిసేపు కనిపించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. గతంలో వీరిద్దరితో నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తీసి ఉండటంతో.. వారు నటించేందుకు ఇప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వారికి స్టోరీ కూడా వినిపించగా. ఓకే చెప్పినట్టుగా సమాచారం.