న్యూ ఇయర్ వెకేషన్ లోఉన్న కింగ్ నాగార్జున… తన నెక్ట్స్ మూవీ వైల్డ్ డాగ్ రిలీజ్ కు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో కథలను తీర్చిదిద్దిన సోలోమాన్ వైల్డ్ డాగ్ ద్వారా డైరెక్టర్ గా తన లక్ పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తైన వైల్డ్ డాగా… ఇది వరకే అయిన అగ్రిమెంట్ ప్రకారం జనవరి 26న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
నాగ్ తన నెక్ట్స్ సినిమా కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. గరుడ వేగ డైరెక్టర్ ప్రవీణ్ చెప్పిన లైన్ కు ఇప్పటికే నాగ్ ఒకే చెప్పారు. అయితే ప్రవీణ్ ఫైనల్ డ్రాఫ్ట్ మాత్రం పూర్తి చేయలేకపోయారు. దీంతో ఇంకా వేచి చూసే ఓపిక లేని నాగ్… ఈ నెలాఖరులోగా పని చేసుకొని రావాలని లేదంటే ఇతర డైరెక్టర్లతో తన నెక్ట్స్ ఫిల్మ్ మొదలుపెడతానని డెడ్ లైన్ పెట్టినట్లు ఫిలింనగర్ లో టాక్ నడుస్తోంది.
నాగ్ ఈ వీకెండ్ కు ఇండియా చేరుకోనున్నారు.