కింగ్ నాగ్! వెరైటీ మనిషి ! ఎప్పుడూ ఏదో న్యూ లుక్‌లో కనిపిస్తుండటం నాగ్ టేస్ట్. వయస్సు పెరిగే కొద్దీ యంగ్ లుక్ కోసం రకరకాల ప్రయత్నాలు చేయడమే నాగ్ స్పెషల్. దట్టూ ఫిట్‌నెస్ కోసం చాలా కష్టపడతాడు.
బిగ్‌బాస్ వీకెండ్ షోలో కింగ్ నాగార్జున చేతిపై కొత్త టాటూ కనిపించింది. దిక్సూచిలో కన్ను, దాని వైపు చూస్తున్న బుసలు కొట్టే నాగు పాము..ఇదీ నాగ్ చేతిపై టాటూ!
ఇంతకూ దీని అర్ధం ఏమిటని నాగ్‌ని ప్రశ్నిస్తే.. దిక్సూచిలో కన్ను తనదేనని చెప్పాడు. కొత్తదనం కోసం అన్వేషణ చేసే నాగ్ అంతరంగం ఎవరికీ అంతుబట్టదు. ‘ఎన్ అంటే నాగార్జున. స్నేక్ పక్కన చుక్కలు కుబుసం విడిచిన నాగుపాముకు చిహ్నం. దానిలాగే గతాన్ని విడిచిపెట్టి కొత్త విషయాలు అన్వేషిస్తుంటాను’ అని సెలవిచ్చారు నాగ్ !
హీరో ఎల్లప్పుడూ కొత్తగా కనిపిస్తేనే ఫాన్స్‌కి ఎట్రాక్షన్. అందుకే నాగార్జున కొత్త టాటూ డిస్కషన్!