అక్కినేని నాగార్జున అంటే అన్ని విషయాల్లో పక్కాగా ఉంటాడన్న పేరుంది. అది బిజినెస్ అయినా, సినిమా అయినా, మరేదయినా సరే. కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ అన్ని రద్దయిపోయాయి. ప్రభుత్వం ఆంక్షల మధ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ పెద్ద హీరోలు తమ సినిమాల షూటింగ్ లకు వెళ్లే సహసం చేయలేదు.
కానీ తాజాగా నాగ్ ఓ అడుగు ముందుకేశాడు. తన సినిమా వైల్డ్ డాగ్ కోసం హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఓ ఆఫీస్ గెటప్ చిత్రీకరణ చేశారని, ఇక నుండి ఈ సినిమా షూటింగ్ రెగ్యూలర్ గా సాగుతుందని తెలుస్తోంది. అన్ని కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని… షూటింగ్ స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 7 నుండి నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుండగా… ఈ నెలాఖరులో బాలయ్య-బోయపాటి సినిమా కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో పెద్ద హీరోలంతా ఇక షూటింగ్స్ మొదలుపెట్టే అవకాశం కనపడుతుంది.