సెలెబ్రిటీ మామా కోడళ్ళకి పడటం లేదా?
సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా మనకు తెలిసిందే. ఒకే ఫ్యామిలీలో పది మంది హీరోలు వచ్చినా ఎంకరేజ్ చేస్తున్న బ్రాడ్‌మైండెడ్ మనసులు మనవి. అలాంటి ఓ ఇంట్లోకి మరో సెలెబ్రిటీ వచ్చి కోడలిగా వచ్చి చేరడం గుర్తుందిగా? ఔను, మీ గెస్సింగ్ కరక్టే.. సమంత గురించే మాట్లాడేది. అక్కినేని ఫ్యామిలీ గురించి ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక మ్యాటర్ ఇది. తన మామ టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కొత్త కోడలు పిల్ల సమంత అక్కినేనికి ఇప్పుడు అస్సలు సరిపడ్డం లేదట.
మేటర్‌లోకి వెళ్తే.. నాగ చైతన్య, సమంత జంట పెళ్ళయిన కొత్తలో బాగా అన్యోన్యంగా అందరి దిష్టీ తగిలేలా కలిసిమెలిసి ఉన్నారు. పెళ్లయ్యాక కూడా సమంత కాస్త గ్లామర్ డోస్ పెంచి ఒళ్ళు కనబడేలా దుస్తులు వేసుకోవడం నాగ్‌కి నచ్చలేదని, ఈ విషయంలో కాస్త ఇబ్బందులు మొదలయ్యాయని వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు విడుదలయి ఘోరపరాజయం మూటకట్టుకున్న నాగార్జున లేటెస్ట్ సినిమా మన్మథుడు-2 విషయంలో మళ్ళీ తేడాలు వచ్చినట్టు వార్త ఒకటి గుప్పుమంటోంది. నాగార్జున ఈ సినిమాలో ప్లేబోయ్ లాంటి ఆ కేరెక్టర్ ఒప్పుకోవడమే సమంతకు అస్సలు నచ్చలేదట. అందుకే ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదట. అస్సలు ఆ సినిమా ఊసే ఎత్తలేదట. మరి ఆ సినిమాలో సమంతా ఎందుకు యాక్ట్ చేసినట్టు?
ఆ సంగతి అలావుంచితే.. నాగ్ ఎప్పుడో ప్రకటించిన తన తదుపరి ప్రాజెక్ట్.. సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ సినిమాకు సమంతా ఎసరు పెట్టిందని తాజా టాక్. అందులో కూడా బంగార్రాజు కేరెక్టర్ పెద్ద ప్లేబోయ్ అని మనకు తెలిసు. అందులో నాగచైతన్య ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. కథలో సమంత కొన్ని మార్పులు సూచించడం, అవి చేస్తేనే చైతూ అందులో నటిస్తాడని కండీషన్ పెట్టడంతో నాగ్ గారికి కోపమొచ్చిందని ఫిలింనగర్ భోగట్టా. దీనివల్లే బంగార్రాజు సినిమా ఇంకా పట్టాలెక్కలేదట.
ఆ ప్రాజెక్ట్ వెనక్కి నెట్టేసి చైతు.. యూత్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ములతో కొత్త సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు. వీటితో పాటూ చైతూ-సమంతా వేరొక బ్యానర్ స్థాపించి ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నారు. హోమ్ బ్యానర్ కాదని బయటి బ్యానర్ సినిమాలకు ప్రాముఖ్యత ఇవ్వడం…మొగుడూపెళ్లాం కలిసి సొంతంగా బ్యానర్ పెట్టుకోవాలనుకోవడం.. ఆ మధ్య తన యాడ్‌కు అపోజిట్‌గా మరో యాడ్ చేసి అందులో డైరెక్టుగా తన గురించి ప్రస్తావించడం.. ఇదిగో ఇలా ఇవన్నీ ఆ మామాకోడళ్ళకు అస్సలు పొసగడం లేదని, అక్కినేని వారింట గొడవలు భగ్గుమంటున్నాయని ఒక న్యూస్ వైరల్ అవుతోంది. నాగ్ లేదా శ్యామ్… ఇద్దరిలో ఎవరైనా అధికారికంగా వివరణ ఇస్తే కానీ ఈ వార్తలు చల్లబడేలా లేదు.