వైల్డ్ డాగ్ షూట్ పూర్తిచేసుకున్న అక్కినేని నాగార్జున… తన నెక్ట్స్ ఫిల్మ్ పై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాగ్ బంగర్రాజు అనే సినిమాను చేయాల్సి ఉండగా, చాలా నెలలుగా పెండింగ్ లో ఉంది. మరోవైపు ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఏ సినిమాను మొదట టెకప్ చేస్తారన్నది ఇంకా ప్రకటించాల్సి ఉంది.
అయితే, డైరెక్టర్ ప్రవీణ్ తన క్రూ ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు. నాగ్ సరసన నటించేందుకు హీరోయిన్ గా కొత్త అమ్మాయి అనిక్హ సురేంద్రన్ ను ఎంపిక చేశారు. ఇటీవలే తనపై లుక్ టెస్ట్ చేశారని… నాగ్ కూడా ఇంప్రెస్ కావటంతో ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక బంగర్రాజు మూవీ నుండి చైతన్య తప్పుకోవటంతో మరో లీడింగ్ హీరో కోసం చిత్ర యూనిట్ వేట కొనసాగిస్తున్నట్లు సమాచారం.