సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ఇటీవల గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడంటూ చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు సైతం నాగబాబు పై నిప్పులు చెరుగుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ నేత మానవతా రాయ్ ఓయూ పోలీస్ స్టేషన్ లో నాగబాబు పై ఫిర్యాదు కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే బాబు మరో ట్వీట్ చేశారు. ఏదేమైనా నా వ్యక్తిగత బాధ్యతతో ట్వీట్ చేశాను.. నా అభిప్రాయంతో జనసేనపార్టీ కి కానీ, నా కుటుంబానికి కానీ సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. మరో వైపు నాగ బాబు వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నా నాటు వివాదాస్పద దర్శకుడు వర్మ సైతం మాట్లాడిన సంగతి తెలిసిందే.