పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత సినీ నటుడు నాగబాబు ఘాటుగా రిప్లై ఇచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మొదట జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి ఆ తర్వాత బిజెపికి మద్దతు ప్రకటించడం పట్ల పవర్ స్టార్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. అయితే ఇదే విషయమై ప్రకాష్ రాజు వ్యాఖ్యలపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజకీయల్లో నిర్ణయాలు అనేక సార్లుమారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్ లో పార్టీ కి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో బీజేపీ కి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకి కృషి చేయటం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవడికి కళ్యాణ్ ద్రోహం చేసాడని ప్రతి పనికిమాలినవాడు..విమర్శిస్తున్నాడు.
మిస్టర్ ప్రకాష్ రాజ్ … నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి డిబేట్
లొనే అర్థం అయ్యింది.సుబ్రమణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లాడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది.నీ ఉద్దేశ్యం లో బీజేపీ తీసుకొన్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీగాని మరి ఏ పార్టీ గానిప్రజలకు మంచిచేసినా హర్షించగలగాలి.విమర్శించటం తప్ప మంచి చేస్తే మేచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏమి చెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను.ఈ దేశానికి బీజేపీచెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను.ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీ తో AP కి జనసేన పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం.నీ లాంటి కుహనా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఆపలేరు. నిర్మాతలని ఎన్నిరకాలుగా డబ్బుకోసం హింస పెట్టవో, ఇచ్చిన డేట్స్ ని క్యాన్సల్ చేసి ఎంత హింసకి గురిచేసావో ఇంకాగుర్తున్నాయి ప్రకాష్ రాజ్. ముందు నువ్వు మంచిమనిషిగా తయారయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ అనే ఒకమంచి మనిషి నిస్వార్థ పరుడైన నాయకుడి ని విమర్శించు.డైరెక్టర్స్ ని కాకా పట్టి నిర్మాతలని కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడ్డం ఏమి తెలుసు.బీజేపీ నాయకత్వాన్ని నివ్వు నోటికొచ్చినట్లువిమర్శించినా నిన్ను ఎవరు ఏమి అనలేదంటే అది బీజేపీ డేమోక్రసి కు ఇచ్చే విలువ అని అర్ధం చేసుకో.బీజేపీజనసేన ఎలక్షన్స్ లో కచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్ళుపొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట
వేసుకోకు.