కరోనా మహమ్మారి కారణంగా సినీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆపేయడం తో సినీ స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే కరోనా కట్టడి అవుతున్న నేపథ్యంలో అందరూ బయటకు వస్తున్నారు. ప్రయాణాలకు సైతం అనుమతులు రావడంతో స్టార్స్ ఫ్యామిలీల తో బయటకు వెళ్తున్నారు. దుబాయ్, మాల్దీవుల వంటి ప్రదేశాలకు వెకేషన్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్య సమంత కూడా మాల్దీవుల్లో లకు వెళ్లారు. నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరిగాయి. ఆ ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దాదాపు వారం రోజుల పాటు ఈ జంట అక్కడే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ ఈ జోడీ తిరిగి వచ్చేసింది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది.