నాగ చైతన్య దూత అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది ఒక ఉల్లాసకరమైన హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.
కాగా బుధవారం ఈ వెబ్ సిరీస్ కు సంబందించిన ఓ ఫోటోను మేకర్స్ సోషల్ మీడియా లో షేర్ చేశారు. అందులో చైతన్య, విక్రమ్ కుమార్, నటి పార్వతి, ప్రియా భాస్కర్ లు కలిసి కనిపించారు.
ఈ ఫోటోను షేర్ చేస్తూ, అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ దూత సెట్స్ నుండి యువసామ్రాట్ నాగచైతన్య, మలయాళ నటి పార్వతి ,ప్రియా భశంకర్ అంటూ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఇక దూత సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానుంది. దాదాపు 8-10 ఎపిసోడ్‌లు ఉండనున్నాయి. వెబ్ సిరీస్‌లో మొత్తం మూడు సీజన్లు ఉంటాయి. మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన థాంక్యూలో, అమీర్ ఖాన్ చేత లాల్ సింగ్ చద్దాలో కూడా నటిస్తున్నాడు.