ఇటీవల కాలంలో హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో వార్తలు రకరకాలుగా వస్తున్నాయి. విడాకుల ప్రకటన చేసిన తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. వీటిపై సమంత అప్పుడప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడు పబ్లిక్ లో ఈ విషయం గురించి మాట్లాడని నాగచైతన్య ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఏ పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. అయితే అది వ్యక్తిగతంగా, కుటుంబం గౌరవానికి భంగం కలిగేలా ఉండకూడదు. అలాంటి పాత్ర, కథ నా దగ్గరికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను అంటూ చెప్పుకొచ్చాడు చైతు.
అయితే నాగచైతన్య వ్యాఖ్యలు పరోక్షంగా సమంత గురించే అన్నాడని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇకపోతే సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసిన సంగతి తెలిసిందే.