అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’. టాలీవుడ్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ మూవీస్ హీరో అనిపించుకుంటున్న చైతన్య.. కుదిరినప్పుడల్లా మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే దడ, దోచేయ్, సవ్యసాచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమాలు చైతూకి అంత మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. లేటెస్ట్ గా మరోసారి మాస్ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోడానికి ‘కస్టడీ’ సినిమాతో వచ్చేస్తున్నాడు.
ఇందులో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో మే 12న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా మూవీ టీజర్ ను గురువారం రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చేసాడు దర్శకుడు. 90’s బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా కథ ఉండబోతుందని అర్ధమవుతుంది.
టీజర్ మొత్తాన్ని నాగచైతన్య వాయిస్ ఓవర్ తో నడిపించాడు. చైతన్య చెప్పిన డైలాగ్స్.. కథ ఏంటో చెప్పడమే కాదు, పవర్ ఫుల్ గా కూడా ఉన్నాయి. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైన తీసుకు వెళ్తుంది. అది ఇప్పుడు తీసుకు వచ్చింది నన్ను ఒక యుద్దానికి.. నా చేతిలో ఉన్న ఆయుధం నిజం.. నిజం ఒక ధైర్యం.. నిజం ఒక సైన్యం.. ఆ నిజం నా కస్టడీలో ఉంది.. అంటూ చెప్పిన డైలాగ్స్ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి.
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుత్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు.