నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించటం తో పాటు మంచి వసూళ్లను కూడా సాధిస్తుంది. మొదటి రోజు ఊహకందని రీతిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది.
ఇదిలా ఉండగా…మొదట దర్శకుడు కొత్త వాళ్లతో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడట. కొంత భాగాన్ని కూడా షూట్ చేశాడట. అది నచ్చక పోవటంతో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ కు స్టోరీ వినిపించాడట. కానీ ఉప్పెన చేస్తుండటం తో నో చెప్పాడట. అలా నాగ చైతన్య దగ్గరకు కథ వెళ్లగా ఓకే చెప్పాడట.