శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కు సంబంధించి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తరువాత సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటం తో సెప్టెంబర్ 24కు ప్లాన్ చేశారు.
ఈ లోపు సినీ పెద్దలు జగన్ తో మీటింగ్ కూడా కంప్లీట్ అవుతుందని మేకర్స్ భావించారు. కానీ ఆ మీటింగ్ వాయిదా పడుతుండడంతో లవ్ స్టోరీ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. కాగా ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు వాయిదా వేయగా… మరోసారి వాయిదా వేసే సాహసం చేయడం లేదు మేకర్స్.