ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లకు డిమాండ్ పెరిగింది. కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో వెబ్ సిరీస్ ను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించడం స్టార్ట్ చేశారు. కాగా ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్… వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య… ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నాగ చైతన్య నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టు కూడా సమాచారం. ఈ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు.
అయితే విక్రమ్ కె కుమార్ గతంలో మనం సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం నాగచైతన్యతో విక్రమ్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ మూవీ ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.