లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్ లను అందుకున్నాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా, అవికా గోర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా నాగ చైతన్య నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే… నాగ చైతన్యతో జతకట్టనుందట.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారట. గతంలో పూజా హెగ్డే, నాగ చైతన్య ఒక లైలా కోసం సినిమాలో నటించారు.
ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.