నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
సెప్టెంబర్ 13 న ఉదయం 11:07 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ రేవంత్, మౌనిక లవ్ స్టోరీ అని ట్వీట్ చేశారు యూనిట్. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.