శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం లవ్ స్టొరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే నిజానికి ఈరోజు సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీలు పడలేదు.
తాజా ఈ చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు అమిగోస్ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు.