బంగార్రాజు సినిమా తో ఇటీవల సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. అంతకన్నా ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రంతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస హిట్ లతో మంచి జోష్ మీదున్న నాగచైతన్య తాజాగా వెంకట్ ప్రభుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల మానాడు చిత్రం తో వెంకట్ ప్రభు హిట్ కొట్టాడు. ఈ సినిమాను ప్రస్తుతం సురేశ్ ప్రొడక్షన్స్ వారు రీమేక్ చేస్తున్నారు. కాగా ఇటీవల చైతూను కలిసిన ప్రభు కథ చెప్పగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
మరోవైపు పరశురామ్, విజయ్ కనకమేడల, నందిని రెడ్డిలు కూడా చైతూ తో సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మరి చైతూ ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.
ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాశీకన్నా, అవికాగోర్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.