అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య మొదట్లో కాస్తా నిరాశపరిచాడు. ఆ తరువాత తన బాడీకి తగ్గ సినిమాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. మజిలీ, వెంకీ మామ సినిమాలతో చైతు సూపర్, డూపర్ హిట్ కొట్టేశాడు. వరుస సినిమా హిట్లతో దూసుకెళ్తోన్న చైతు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చైతు గీత గోవిందం దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లనున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబదించిన స్క్రిప్ట్ పని పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్ టైన్ గా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం టైటిల్ ఆసక్తికరంగా ఉండేందుకు టైటిల్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. తన తాత నాగేశ్వర్ రావు పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే మనం సినిమాలో నాగేశ్వర్ గా అదరగొట్టిన చైతు.. ఇప్పడు పరుశరాం దర్శకత్వంలోని సినిమాకు అదే పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ పరుశురాం చైతూకు చెప్పగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమ్మర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Advertisements