ఇటీవల కాలంలో లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో మంచి హిట్ ను అందుకున్నాడు నాగ చైతన్య. ఇక ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఇందులో రాశి కన్నా, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అలాగే అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. దీనికి కూడా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌లు గా తెరకెక్కించనున్నారు.
అలాగే నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్ లో ఉంటుందట. ఇందులో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించనుంది. అయితే తాజాగా వెబ్ సిరీస్ కు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
అదేంటంటే ధూత అనే టైటిల్ ను ఈ వెబ్ సిరీస్ కు పెట్టినట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.