లవ్ స్టోరీ సినిమాతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న నాగ చైతన్య… ప్రస్తుతం మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్ధాలోనూ చైతూ ఓ కీ రోల్ చేయనున్నాడు.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం… అర్జున్ రెడ్డి డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతూ సినిమా చేయనున్నాడు. గతంలో ఉన్న కమిట్మెంట్ మేరకు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభంకానుంది.
నాగ చైతన్య ఇప్పటికే… నందిని రెడ్డి, మోహనకృష్ణ ఇంద్రగంటిలతో చర్చలు జరుగుతున్నా… ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు.