సంక్రాంతి సందర్భంగా వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సమ్మర్ కి రిలీజ్ కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అభిమానులను నిరుత్సాహ పరచకుండా సమ్మర్ చిత్రాలకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్, కొత్త కొత్త పోస్టర్ లు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామాగా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న లక్ష సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం శరీరం మరింత దృఢంగా మార్చుకున్నారు.
సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించిన నాగ శౌర్య ఇప్పుడు లవర్ బాయ్ ల కనిపించాడు. తాజాగా లక్ష్య సినిమాకు సంబంధించి మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరోయిన్ కేతిక శర్మతో నాగ శౌర్య రొమాంటిక్ స్టైల్ లో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.